సోనూసూద్‌కి హీరోగా ఆఫర్లు… త్వరలోనే సినిమా ప్రకటన ?

Published on Oct 1, 2020 2:02 am IST


నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం చేశారు. వేరొకరితో పనిలేకుండా సొంత ఖర్చులతో అనేక మందిని ఆదుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు బస్సులు ఏర్పాటు చేయడం, ఆదాయ లేక తిండికి సైతం అల్లాడుతున్న వారికి నిత్యావసరాలు సరఫరా చేయడం, ఉద్యోగాలు కోల్పోయిన కొందరికి ఉపాధి ఇవ్వడం, విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్ధిక సహాయం అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు.

లాక్ డౌన్ సమయంలో మంచి కారణంతో దేశం మొత్తం చర్చల్లో నిలిచిన సోనూ సూద్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశం మొత్తం ఆయన్ను రియల్ హీరో అంటూ పొగిడేసింది. ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు తయారయ్యారు. దీంతో నటుడిగా ఆయన డిమాండ్, కీర్తి బాగా పెరిగాయి. అందుకే ఇన్నాళ్లు ఆన్ స్క్రీన్ మీద ప్రతినాయకుడిగా కనబడిన ఆయన్ను హీరోగా పెట్టి సినిమా చేయాలని కొందరు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొందరు సోనూసూద్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. త్వరలోనే సోనూ హీరోగా సినిమా అనౌన్స్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ వర్గాల టాక్.

సంబంధిత సమాచారం :

More