బాలయ్య కోసం కథను వెతుకుతున్నారట

Published on May 1, 2021 1:30 am IST

నందమూరి బాలకృష్ణ ఇకపై సాదా సీదా కథలు చేయాలని అనుకోవట్లేదట. మంచి బలమున్న కథల్నే ఎంచుకోవా;అని డిసైడ్ అయ్యారట. ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘అఖండ’ మీద భారీ అంచనాలున్నాయి. టీజర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో బిజినెస్ బాగా జరుగుతోంది. సినిమా డ్యామ్ షూర్ హిట్ అంటున్నారు. దీంతో ఆయనతో సిమిమాలు చేయాలనుకుంటున్న వాళ్లంతా మంచి కథల్ని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు.

హారిక హాసిని నిర్మాతల దగ్గర బాలకృష్ణ డేట్స్ ఉన్నాయట. ఈపాటికే వీరు కలిసి సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. వీలైనంత త్వరగా బాలయ్య సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారు నిర్మాతలు. అందుకే కథ కోసం వెతుకుతున్నారు. ‘అఖండ’ హిట్ అయితే బాలయ్య మీద అంచనాలు పెరుగుతాయి. కాబట్టి వాటికి అందుకునేలా కథ ఉండాలని చూస్తున్నారట. పాపులర్ రచయితల్ని సంప్రదించి కథను వండించే ప్రయత్నాల్లో ఉన్నారట. ‘అఖండ’ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారు. అది పూర్తైన తర్వాత హారిక హాసిని వారి సినిమా ఉండవచ్చు. ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనేది కూడ ఇంకా ఫైనల్ కాలేదు.

సంబంధిత సమాచారం :