గోపిచంద్ కోసం భారీ ఏర్పాట్లు!


హీరో గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘గౌతమ్ నంద’ కూడా ఒకటి. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ప్రస్తుతం గోపీచంద్ పై దుబాయ్ లో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించే పనులు జరుగుతున్నాయి. ఈ పాటను భారీ స్థాయిలో గ్రాండ్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకోసమే దుబాయ్ లోనే ఫేమస్ లొకేషన్లయిన బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్నారు.

ఈ పాట షూటింగ్ ఈ నెల 3వ వారం నుండి మొదలవుతుందని, ప్రస్తుతం స్థానిక అధికారుల పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నామని, ఇది గోపీచంద్ అభిమానులకు మంచి ఐ ఫీస్ట్ అవుతుందని సంపత్ నంది తెలిపారు. హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.