‘రామాయణ’లో మహేష్.. నిజం ఏంటో తేలేది అప్పుడే

Published on Jun 30, 2021 9:49 pm IST

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి ‘రామాయణ’ అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకులు నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ తెరకెక్కించనున్నారు. రామాయణ గాథను భారతీయులు ఊహించనంత గొప్పగా తెర మీద ఆవిష్కరించడమే ధ్యేయంగా ఈ సినిమాను రొపొందిస్తున్నామని నిర్మాతలు అన్నారు. అప్పట్లో ఇందులో రాముడిగా మహేష్ బాబు, రావణుడిగా హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకొనే నటిస్తారని వార్తలు హడావుడి చేశాయి.

తాజాగా నిర్మాత మధు మంతెన ఈ విషయం మీద స్పందిస్తూ మహేష్, హృతిక్ రోషన్ ఇందులో నటిస్తారా అనే ప్రశ్నకు అవునని కానీ లేదని కానీ సమాధానం ఇవ్వకుండా చిన్న స్మైల్ ఇచ్చి సరిపెట్టారు. ఈ ఏడాది దీపావళి తర్వాత నటీనటులు ఎవరనేది ప్రకటిస్తామని అన్నారు. అంతేకాదు ఇందులో అన్ని విధాలా పరిపూర్ణమైన నటులే ఉంటారని, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని కాస్టింగ్ ఈ సినిమాతో చూస్తారని అంటున్నారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుండి మాత్రమే కాదు దేశంలోని అన్ని వైపుల నుండి నటీనటులను తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మరి వారు అనుకుంటున్న నటీనటుల్లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎంతమంది ఉంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :