“ప్రాజెక్ట్ కే” నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.!

“ప్రాజెక్ట్ కే” నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.!

Published on Dec 31, 2022 12:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సెన్సేషనల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో అయితే పాన్ వరల్డ్ భారీ సినిమా “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఏకంగా వరల్డ్ లెవెల్ హంగులతో ఓ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ అయితే వస్తుంది. దీనితో అనేక అంచనాలు సినిమాపై ఉండగా దీనిని అత్యద్భుతంగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ముగుస్తున్న సమయంలోనే మేకర్స్ అయితే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా స్టార్టింగ్ ఎలా ఉంది దాని “స్క్రాచ్” నుంచి మొదలు అన్నట్టుగా ఓ పరికరాన్ని తయారు చేస్తున్నట్టుగా మేకర్స్ ఇంట్రస్టింగ్ వీడియో వదిలారు. ఇందులో ఓ టైర్ షేప్ లాంటి దానిని తయారు చేస్తున్నట్టుగా మేకర్స్ చూపించారు.

కానీ ఇది అయితే సినిమా కాన్సెప్ట్ లో చాలా కీలకమైన భాగం ఇది పోషించేలా కనిపిస్తుంది. బహుశా టైం మెషిన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మరి దీనితో అయితే ఈ వీడియో ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె అలాగే అమితాబ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అశ్వని దత్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు