అఫీషియల్..పవర్ఫుల్ భీమ్లా నాయక్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు.!

Published on Jul 27, 2021 4:08 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్స్ లో మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరే అప్డేట్స్ ని కూడా వదిలారు. పైగా పవన్ రోల్ పేరు ఈరోజు మేకింగ్ వీడియో కూడా విడుదల చేస్తామని ప్రకటిచడంతో మరింత హైప్ వచ్చింది.

మరి ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు వచ్చేసింది.. మొట్ట మొదటగా థమన్ ఎనర్జిటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే స్టార్ట్ అయ్యి పవన్ మరియు రానా లపై అదిరే విజువల్స్ ని ఇందులో పొందుపరిచారు. అంతే కాకుండా మళ్ళీ సూపర్ కాప్ గా పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ అవతార్ లో కనిపిస్తున్నాడు.

దీనితో మరింత హైప్ మొదలయ్యింది. ఇక వీటన్నిటినీ మించి ఈ చిత్రంలో భీమ్లా టార్గెట్ వచ్చే ఏడాది సంక్రాంతికే ఫిక్స్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వర్క్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :