“గని”గా పంచింగ్ లుక్ తో వచ్చేసిన వరుణ్ తేజ్.!

Published on Jan 19, 2021 11:03 am IST

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరోల్లో కాస్త వైవిధ్యభరిత సబ్జెక్టులను ఎంచుకొనేది ఇప్పట్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. భిన్నమైన జానర్ సినిమాలను చేస్తూ తన సినిమాలకు అంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను వరుణ్ తేజ్ సంపాదించుకున్నాడు. మరి అదే లైనప్ లో వరుణ్ తేజ్ సెట్ చేసిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామాకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు.

కిరణ్ దర్శకత్వంలో కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో అలాగే సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి “గని” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే దీనికి సంబంధించి మోషన్ పోస్టర్ టీజర్ ను కూడా బాగా డిజైన్ చేశారు. థమన్ మరోసారి తన ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంప్రెస్ చేసాడు.

బాక్సింగ్ రింగ్ లో బాక్సింగ్ బ్యాగ్ ను పంచ్ చేస్తూ వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన విధానం సింపుల్ అండ్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రానికి వరుణ్ కూడా గట్టిగానే కష్టపడ్డాడు. మరి ఈ బాక్సింగ్ డ్రామా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మరో కీలక పాత్రలో నటిస్తుండగా అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్దా లు నిర్మాణం వహిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :