గణపతి హోమంలో , గోశాలలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

గణపతి హోమంలో , గోశాలలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

Published on May 16, 2020 12:50 PM IST

puranapanda srinivas in ganapati homam

రాజమహేంద్రవరం : మే 16

పదేళ్లనాడు మంత్రి హోదాలో వున్నప్పుడు ఒక మహా సంకల్పంతో కోట్లాది రూపాయల వ్యయంతో పవిత్ర గోదావరీ తీరంలో కేరళ శబరిమల సంప్రదాయానుసారం నాటి మంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కంపూడి రామమోహన్ రావు అద్భుతంగా నిర్మించిన అయ్యప్ప స్వామి మహాలయంలో ఈ ఉదయం కేరళ సంప్రదాయంలో పరమనిష్టగా జరిగిన మహాగణపతి హోమంలో ప్రముఖ రచయిత , జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ పాల్గొని హోమక్రతువు నిర్వహించారు.

ఈ ఆలయానికి కేరళకు చెందిన నంబూద్రి పూజారిగా ఉండటం ఒక ప్రత్యేక విశేషమైతే , పవిత్ర గ్రంధాల రచన ,ప్రచురణ, ప్రచారోద్యమంలో … అపురూప రచనాశైలిలో అగ్ర శ్రేణిలో దూసుకు పోతున్న పురాణపండ శ్రీనివాస్ మంగళగ్రంధాలకు గోదావరీతీరంలో విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఈ కారణంగా ఆలయంలో పురాణపండ శ్రీనివాస్ కోసం ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఈ హోమాన్ని నిర్వహించారు.

సూర్యోదయ వేళకు పరమ సాత్విక భావాలమధ్య శాస్త్ర విధులతో ఈ గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తి భరితమైన, భక్తి సమాగమమైన ఈ పవిత్ర ఆలయ హోమ కార్యంలో చలపతి గురుస్వామి, జ్ఞాన సరస్వతి ఆలయ చైర్మన్ తోట సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆద్యంతం శ్రీనివాస్ తో కూడా వుండి … ప్రదక్షిణ మొదలు , ప్రసాదం వరకు … పురాణపండ శ్రీనివాస్ కు అన్ని ఏర్పాట్లు ఆలయమర్యాదానుసారం తోట సుబ్బారావు చేయడం గమనార్హం. గణపతి హోమంతోమొదలైన ఈ మంగళ కార్యం అయ్యప్ప స్మరణతోజయప్రదంగా ముగిసింది. శక్తిమంతమైన ఈ శ్రీకార్యంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈసందర్భగా శ్రీనివాస్ చెప్పారు. గోదావరీ తీరంలో పురాణపండ శ్రీనివాస్ జ్ఞాన భక్తియుత అద్భుత గ్రంధాలకు సర్వ శ్రేష్టమైన భారీ స్పందన ఉందనేది మన కన్నుల ముందు కనిపించే సత్యం.

పదిహేనేళ్ల వెనుక ఇక్కడి వేదికలపై అవిస్మరణీయ స్వరంతో శ్రీనివాస్ చేసిన అపురూప ప్రసంగాలు ఈనాటికీ సాహితీ మిత్రులు, కవిత్వ ప్రేమికులు, ఆలయాల అర్చకులు, రాజకీయ నేతలు గుర్తుంచుకుని అదే ప్రేమను పెంచి మరీ ఆదరించడానికి పురాణపండ శ్రీనివాస్ లోని నిస్వార్ధత , ప్రేమతత్వం, మేలు చేసేవిధానం, రాజీపడని మనస్తత్వం, అసాధారణ వాక్పటిమ, అద్భుత రచనశైలి కారణమని వేరే చెప్పఖ్ఖర్లేదు. పదిహేను ఆలయాల నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న సంస్కారమూర్తులు తోట సుబ్బారావు శ్రీనివాస్కి దగ్గరుండి చేసినఆలయ మర్యాదా ఏర్పాట్లపట్ల పురాణపండశ్రీనివాస్ తోటసుబ్బారావు కు విధేయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే రోజు మధ్యాహ్నం ప్రక్కనే వున్న జగద్గురు పీఠం గోశాలను తన ఆత్మబంధువులు చెన్నాప్రగడ శ్రీనివాస్ ( బాబు ) తో కలిసి సందర్శించిన పురాణపండ శ్రీనివాస్ గోవులమధ్య గడిపిన క్షణాల్ని తాను ‘ నిజంగా జీవించిన క్షణాలు ‘ గా చెప్పడం అందరినీ ఆకర్షించింది. ఏది ఏమైనా కరోనా పుణ్యమా అని శ్రీనివాస్ ఎక్కువ సేపు రాజమహేంద్రవరంలో గడపడం .. ఎన్నో వర్గాలవారిని ఆకట్టుకోవడమే కాకుండా , తీరిక లేకుండా కవిత్వ, సాహిత్య , ఆధ్యాత్మిక ప్రేమికులతో శ్రీనివాస్ బిజీగా ఉండటం కనిపించడం ప్రత్యేకంగానే పేర్కొనాలి.

ayyappa temple with puranapanda srinivas

puranapanda srinivas in ganapati homam

puraaapanda srinivas

puraaapanda srinivas

puranapanda srinivas with govu

pradakshina from puranapanda srinivas

సంబంధిత సమాచారం

తాజా వార్తలు