పురాణపండ ‘ శ్రీపూర్ణిమ’ , ‘ నేనున్నాను ‘ అఖండాలకు చిన్నజీయర్ మంగళాశాసనం

పురాణపండ ‘ శ్రీపూర్ణిమ’ , ‘ నేనున్నాను ‘ అఖండాలకు చిన్నజీయర్ మంగళాశాసనం

Published on Feb 20, 2020 12:20 PM IST

Puranapanda Srinivas Sri Purnima Nenunnanu Books

సికింద్రాబాద్: ఫిబ్రవరి : 19

ఆరాధనాత్మకమైన గాఢ అనుభూతినిచ్చే అద్భుత గ్రంధాలను రచించి ప్రచురించి లక్షలమందిని తన్మయత్వంతో పరవశింపచేస్తున్న ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప మహా గ్రంధాలైన ‘ శ్రీపూర్ణిమ’ , ‘ నేనున్నాను ‘ సృష్టిస్తున్న పవిత్ర సంచలనం అంతా యింతా కాదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పవిత్ర సభలో విఖ్యాత ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించిన శ్రీపూర్ణిమ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని అనేక పీఠాలలో, మఠాలలో ఆలయాలలో , సాహిత్య సాంస్కృతిక సన్నివేశాలలో ఒక హాట్ టాపిక్ గా మారింది.

అమృత కలశాల్లాంటి అద్భుత అక్షర శక్తిరూపాల్ని ఆవిష్కరిస్తున్న పురాణపండ శ్రీనివాస్ ఈ దేశంలోనే తొలిసారిగా ఐదువందల ఆంజనేయ వర్ణ చిత్రాలతో మంత్రం తంత్ర యంత్రాత్మకంగా ఊహాతీతంగా వెలువరించిన ‘ నేనున్నాను’ మహా అఖండ గ్రంధం ఇచ్చే శ్రేయస్సు వర్ణించలేం. ఇంతవరకు తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యంలో ఇలాంటి అఖండ గ్రంధం వెలువడలేదనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్, సాయి కొర్రపాటి, దిల్ రాజు, అశ్వనీదత్ , రోజా వంటి సినీ ప్రముఖులే కాకుండా పొన్నాల లక్ష్మయ్య, తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నామా నాగేశ్వరరావు వంటి ఎందరో రాజకీయ ప్రముఖులు సైతం శ్రీనివాస్ అద్భుత గ్రంధాలకు సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. శ్రీనివాస్ బుక్స్ కి వున్న డిమాండ్ అలాంటిది మరి.

జీవన యాత్రలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శ్రీనివాస్ అకుంఠిత కార్య సాధనాశైలితో పాటు ఆయన ఒక పుస్తకాన్ని తీసే విధానం , నిస్వార్ధంగా చేసే ధార్మిక సేవకు తోడుగా ఎంతో సౌందర్యవంతమైన వ్యాఖ్యానవైఖరి పాఠకుల్ని , భక్తుల్ని పారవశ్యాన్ని గురి చేస్తోంది. అదే పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేకత. అందుకే ఆ ఆకర్షణ. ఇలాంటి విలక్షణ వ్యక్తిని మన మధ్యన ఇంకొకరిని చూడలేం. ప్రధానాంశానికి వస్తే దేశదేశాల తెలుగు వారినీ శ్రీమన్నారాయణుడి తత్వంతో తన్మయింప చేస్తున్న పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఇటీవల సికింద్రాబాద్ లో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణా బ్యాంకు ఉద్యోగుల సంఘం అద్యక్షులు మద్దులపల్లి సత్యకుమార్ స్వామివారికి పురాణపండ శ్రీనివాస్ మహా అఖండ గ్రంధం ‘ నేనున్నాను ‘ ను అందజేసి మంగళాశాసనాలు పొందడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టివి.9 చైర్మన్, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు కు కూడా ఈ మహాగ్రంధాన్ని మద్దులపల్లి సత్య కుమార్ అందజేయగా – రామేశ్వర రావు మాట్లాడుతూ పురాణపండ శ్రీనివాస్ తనకు చాలాకాలంగా పరిచయమున్న ఆధ్యాత్మిక ఆత్మ బాన్ధవ్యుడని , ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు.

బ్యాంకు ఉద్యోగుల సంక్షేమమే కాకుండా సమాజంలో అనేక సాంఘిక సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహవంతంగా పాల్గొనే కుమార్ అలహాబాద్ బ్యాంకు ఉద్యోగిగా ఎంతోమందికి ఆప్తుడు కావడం విశేషం. మరొక ముఖ్యాంశమేంటే … బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి కి జరిగిన ఒక ధార్మిక సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిన్నజీయర్ స్వామి కార్యక్రమానంతరం తాటిపర్తి లో మరొక పరమపవిత్ర ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అక్కడి రామాలయ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించి , అపర్ణాదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆకొండి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం ప లుకగా నగరి ఎమ్మెల్యే రోజా సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా రచించి, సంకలనం చేసి వెలువరించిన శ్రీపూర్ణిమ గ్రంధాన్ని ఈ సందర్భంలో చిన్నజీయర్ స్వామీజీ పవిత్ర హస్తాలకు ఆకొండి ప్రభాకరశర్మ సమర్పించి మంగళాశాసనాలు పొందడం గమనార్హం. ఈ సందర్భగా స్వామీజీ ఎంతో ఆసక్తిదాయకంగా ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధాన్నిపరిశీలించడం ఒక విశేషంగానే చెప్పాలి.

మొత్తంమీద ఒక వారంలో చిన్న జీయర్ రెండు పవిత్ర కార్యక్రమాలలో పురాణపండ శ్రీనివాస్ దైవీయచైతన్య సంపదను ఆయాప్రాంతాల ప్రముఖులైన మద్దులపల్లి సత్యకుమార్, ఆకొండి ప్రభాకర శర్మ అందించడం మంత్రగ్రంథాలపట్ల భక్తులకు, స్వామీజీలకు వున్న పూజ్య భావాన్ని ప్రకటిస్తోందనడంలో సందేహం లేదు.

Chinna Jeeyar Swamy Nenunnanu book

Rameswar Rao Jupally

Chinna Jeeyar Swamy Nenunnanu book

సంబంధిత సమాచారం

తాజా వార్తలు