బాలయ్యతో డాషింగ్ డైరెక్టర్ ఫిక్స్ ?

Published on Feb 8, 2023 3:00 am IST


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్య బాబు కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నాడని.. ఈ క్రమంలోనే పూరి గతంలో తన టీమ్ తో కలిసి గోవాలో క్యాంప్ వేసుకుని మరీ స్క్రిప్ట్ పై కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కథ పూర్తి అయిందట. త్వరలోనే బాలయ్యను కలిసి ఈ కథను పూరి వినిపించబోతున్నాడు. పూరి కథలో మంచి డెప్త్ ఉందని తెలుస్తోంది. పైగా ఈ కథా నేపథ్యం కూడా చాలా కొత్తగా ఉంటుందట. అలాగే తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో మంచి ఎమోషన్ కూడా ఉంటుందట.

కాగా సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. లైగర్ ప్లాప్ తర్వాత.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి పూరి ఈ కథ పై బాగా వర్క్ చేశాడు. కాబట్టి, ఈ సారి బాలయ్య – పూరి కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. పూరితో సినిమా చేయడానికి తాను ఎప్పుడూ రెడీ అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :