ముంబైలో విజయ్ పై ముహూర్తం షూట్..!

ముంబైలో విజయ్ పై ముహూర్తం షూట్..!

Published on Jan 20, 2020 9:57 AM IST

ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ అనంతరం డైరెక్టర్ పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండతో మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఫైటర్ గా కనిపిస్తుండగా ఆ పాత్ర కొరకు థాయిలాండ్ వెళ్లి నిపుణుల సమక్షంలో కిక్ బాక్సింగ్ తో పాటు ఇతర ఫైట్ ఫార్మ్స్ నందు శిక్షణ పొందారు. కాగా నేడు ముంబైలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ పంచుకున్నారు.

విజయ్ 10వ చిత్రంగా తెరకెక్కుతున్నఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేయనున్నారు. ఇక అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. పూరి, విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు