పవన్ కళ్యాణ్ తో మళ్ళీ పూరి జగన్నాధ్ ?

Published on Aug 1, 2021 7:20 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో మరో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గతంలోనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో పవన్ కి అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేసి.. సినిమా ప్రమోషన్స్ ను కూడా పవన్ కి అనుగుణంగానే సెట్ చేశాడు.

అలాగే పవన్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేయించాడు. మొత్తానికి ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఇంప్రెస్ అయిన పవన్, దిల్ రాజుతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. తాజాగా ఆ సినిమాకి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తోంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు.

కాగా పవన్ కోసం తన దగ్గర ఒక కథ ఉందని కూడా పూరి ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :