పూరి ప్లాన్స్ అన్నీ బాలీవుడ్ మీదే ఉన్నట్టున్నాయి

Published on Dec 13, 2019 11:16 am IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత పూరి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా విజయ్ దేవరకొండతో ఆయన మొదటిసారి చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పూరి అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే బాలీవుడ్ పరిశ్రమను టార్గెట్ చేశారు.

సినిమాలో తప్పకుండా బాలీవుడ్ నటినే కథానాయకిగా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఆయన జాబితాలో ఉన్న హీరోయిన్లలో నిన్నటి వరకు కైరా అద్వానీ పేరు మాత్రమే వినబడగా ఇప్పుడు మరొక యంగ్ బ్యూటీ అనన్య పాండే పేరు కూడా చేరింది. ఈమెకు కూడా పూరి కథ చెప్పారని, అది నచ్చిన అనన్య డేట్స్ అడ్జెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉందని సమాచారం. అంటే ముందుగా ఏ హీరోయిన్ డేట్స్ ఇస్తే ఆమెనే ఫైనల్ చేస్తారన్నమాట పూరి. ఇకపోతే ఈ చిత్రాన్ని ఛార్మీతో కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ సైతం నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారట.

సంబంధిత సమాచారం :

More