చలిలో చిత్రీకరణ చేస్తున్న టాప్ డైరెక్టర్ !
Published on Oct 28, 2017 8:28 pm IST

పూరి జగన్నాథ్ ప్రస్తుతం తనయుడు ‘ఆకాష్ పూరీ’ని హీరోగా నిలబెట్టే పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాదించనప్పటికీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. మెహబుబా చిత్రం తీస్తున్నారు, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు, 1971 ఇండియా, పాక్ నేపద్యలో జరిగిన యుద్ధ నేపద్యలో ఈ సినిమా తెరకేక్కబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది, బాగా చలి ఉన్న ప్రదేశంలో చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు, ఈ సందర్భంగా ఆకాష్ ఒక వీడియోను తన పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు18 వేల అడుగుల ఎత్తులో, 7 డిగ్రీల వాతావరణంలో మంచు కురుస్తుండగా ఈ విడియో తీసారు, దీన్ని చూస్తే తెలుస్తుందిచిత్ర యూనిట్ ఎంత చలిలో చిత్రీకరణ జరుపుకుంటున్నారో. ఈ సినిమాతో తండ్రి, తనయులు విజయం సాదించాలని కోరుకుందాం

 
Like us on Facebook