యాక్షన్ తో మొదలెట్టనున్న ‘ఫైటర్’ !

యాక్షన్ తో మొదలెట్టనున్న ‘ఫైటర్’ !

Published on Nov 29, 2019 2:00 AM IST

Vijay Puri

పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాలుగో వారం నుండి మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ స్ తియనున్నారట. మరి ఈ చిత్రం ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ లేదా మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇద్దరిలో ఒకరు విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ ఓ మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరికీ క్రేజ్ ఉన్నా మేకర్స్ ఎవ్వరూ వీళ్ళను పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. మరి పూరినే ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు