యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. సినిమా మొదలు పెట్టి ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం మళ్ళీ కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూట్ ని రీ స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ముహూర్తం రోజే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2105 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒక నెల షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం వలన అనుకున్న టైం కి రాదేమో అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు తెరదించే న్యూస్ మీకందిస్తున్నాం. కేవలం 85 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేసి అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేస్తామని పూరి జగన్నాధ్ ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కి మాటిచ్చాడు. దీని ప్రకారమే బండ్ల గణేష్ సినిమాకి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆలస్యం కాకుండా చూసుకుంటున్నారు.


