‘ఫైటర్’ మ్యూజిక్ కోసం కొత్త మార్పు ?

‘ఫైటర్’ మ్యూజిక్ కోసం కొత్త మార్పు ?

Published on Jul 13, 2020 2:53 PM IST

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ – డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో ‘ఫైటర్’ సినిమా వస్తోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు పని చేస్తున్నాడు. కానీ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తుండటం, దాంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి మార్కెట్ రావాలనే ఉద్దేశ్యంతో.. ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుంటే బాగుంటుందని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్, దర్శకుడు పూరికి సలహా ఇచ్చారని.. దానికి పూరి కూడా ఓకే అన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు