‘పురుష:’ చిత్ర థాంక్యూ మీట్.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన మూవీ టీమ్

‘పురుష:’ చిత్ర థాంక్యూ మీట్.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన మూవీ టీమ్

Published on May 24, 2026 5:15 PM IST

Purusha Telugu Movie

కల్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వం వహించిన చిత్రం ‘పురుష:’. పవన్ కల్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి సానుకూల స్పందన లభిస్తున్న నేపథ్యంలో శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ‘థాంక్యూ మీట్’ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ యాక్టింగ్ గురువు సత్యానంద్ మాస్టర్ వద్ద తాను నటనలో శిక్షణ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి వల్లే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ కాగలిగిందని దర్శకుడు, నిర్మాతలు తెలిపారు.

కథపై నమ్మకంతో రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించామని నిర్మాత కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ అందించగా, శ్రవణ్ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొని సినిమాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తలు