“పుష్ప” రిలీజ్‌కి ఆ డేట్ ఫిక్స్ కాబోతుందా?

Published on Jul 7, 2021 4:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ తిరిగి నిన్నటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది.

అయితే 45 రోజులు పాటు కంటిన్యూగా షూటింగ్ జరిపి పుష్ప-1 కంప్లీట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. ఇదిలా ఉంటే పుష్ప-1 సినిమాను క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే అధికారికంగా మాత్రం పుష్ప-1 రిలీజ్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :