గెట్ రెడీ..”పుష్ప” మ్యూజిక్ ఆల్బమ్ ఇంకో లెవెల్లో వచ్చిందట.!

Published on Jul 31, 2021 8:01 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ లెవెల్లో ఐకాన్ స్టార్ గా నిలబెట్టబోతున్న భారీ పాన్ ఇండియన్ చిత్రమే “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తన ఇంటెలిజెన్స్ తో రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. అయితే ఈ చిత్రం పై ఇన్ని అంచనాలు నెలకొనడానికి గల ప్రధాన కారణాల్లో ఈ కాంబో..బన్నీ, సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ లనే చెప్పాలి.

ముఖ్యంగా వీరి కాంబో అంటే సినిమా కథను పక్కన పెడితే మ్యూజిక్ ఆల్బమ్ ఇంకో లెవెల్లో హిట్ అవుతుంది. అందుకే పుష్ప ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం స్యూర్ షాట్ గా కొట్టబోతున్నట్టు పుష్ప మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ చాలా బాగా వచ్చిందని మళ్ళీ కొన్నాళ్ల పాటు అందరి ప్లే లిస్ట్ లో ఒక చార్ట్ బస్టర్ గా పుష్ప కూడా నిలిచిపోతుంది అని బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనితో పుష్ప ఆల్బమ్ ఆర్య, ఆర్య 2 లని మించే సెన్సేషన్ అవుతుంది అని చెప్పాలి. మరి ఎప్పుడు నుంచి ఈ సినిమా సాంగ్స్ బయటకి వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :