నైజాంలో ఆల్ టైం రికార్డ్ తో స్టార్ట్ చేసిన “పుష్ప ది రైజ్”.!

Published on Dec 18, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల తో ముందే నైజాం లో రికార్డు కలెక్షన్ వస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వెయ్యగా దానిని నిజం చేస్తూ నైజాం గడ్డపై పుష్ప రాజ్ దుమ్ము లేపాడు.

డే 1 అక్కడ ఆల్ టైం రికార్డు షేర్ 11.44 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ నే అధికారికంగా ప్రకటన చేశారు. దీనితో ఈ చిత్రం మొదటి రోజు లెక్కే ఆల్ టైం నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. మరి ఓవరాల్ డే 1 వసూళ్లు కోసం తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :