సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డు దిశగా “పుష్ప” సాంగ్.!

Published on Aug 14, 2021 8:51 am IST

నిన్ననే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ గ్రేడింగ్ చిత్రం “పుష్ప” ది రైజ్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ ని పాన్ ఇండియన్ లెవెల్లో మొత్తం 5 భాషల్లో మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు మరియు సాలిడ్ ప్రమోషన్స్ తో ఈ చిత్రాన్ని మేకర్స్ నిన్న వదిలారు. మరి ఆ అంచనాలు అన్నిటికి తగ్గట్టుగా దేవీ ఇచ్చిన బీట్ ఇపుడు దుమ్ము లేపుతుంది.

సుకుమార్, బన్నీ దేవిశ్రీ ల కాంబో అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో పుష్ప ఫస్ట్ సింగిల్ ఇప్పుడు చూపిస్తుంది. ప్రస్తుతానికి ఆల్రెడీ రికార్డు బ్రేకింగ్ వ్యూస్ మన తెలుగులో రాబట్టేసి 8 మిలియన్ మార్క్ ని చేరుకుంది. అంతే కాకుండా ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టేలా ఉందని చెప్పాలి.

మన దక్షిణాదిన మాస్టర్ కుట్టి స్టోరీ సాంగ్ ఇప్పటి వరకు 8.26 మిలియన్ వ్యూస్ తో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దానిని ఆల్రెడీ 8 మిలియన్ క్రాస్ చేసిన పుష్ప సాంగ్ బ్రేక్ చెయ్యడం పెద్ద విషయం కాదని చెప్పాలి. మరి పుష్ప సాంగ్ దానిని బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు సెట్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :