రిలీజ్ కి ముందే “పుష్ప” సాంగ్ మొత్తం లీక్..మేకర్స్ ఏం చేస్తున్నారో.?

Published on Aug 13, 2021 7:08 am IST


ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం “పుష్ప” పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి అన్నది అందరికీ తెలిసిందే.. భారీ బడ్జెట్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం నుంచి ఈరోజు మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.. మాములుగా అయితే ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సిన సమయం కానీ కరోనా వల్ల ఈరోజు రిలీజ్ కాలేదు.

కానీ ఈ స్పెషల్ డే న మేకర్స్ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అసలే సుకుమార్, దేవిశ్రీప్రసాద్ మరియు బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది అందుకే సాంగ్స్ విషయంలో మాత్రం అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందులో భాగంగానే అన్ని భాషల్లో కూడా ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు.. కానీ అనూహ్యంగా అసలు ఈరోజు రిలీజ్ కావాల్సిన సాంగ్ నిన్ననే లీక్ అయ్యిపోయి షాకిచ్చింది..

అయితే ఫుల్ సాంగ్ కొద్దిగా క్లారిటీ లేదు కానీ మొత్తం సాంగ్ లీక్ అవ్వడం అనేది మేకర్స్ తప్పిదం అనే చెప్పాలి.. ఇది కావాలని జరిగిందా లేక పొరపాటున జరిగిందా అన్నది తెలియదు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా బాధ పడ్డారు. ఇప్పటికే చాలా లీక్స్ ఈ సినిమా నుంచి వచ్చాయి కానీ ఈసారి ఏకంగా ఒకరోజు రిలీజ్ ముందు మొత్తం సాంగ్ వచ్చేయడంతో అసలు మేకర్స్ ఏం చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరి ముందు రోజుల్లో అయినా ఇలాంటివి ఆగుతాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :