“పుష్ప” నుంచి ఫహద్ పై సాలిడ్ పోస్టర్ వదిలిన మేకర్స్.!

Published on Aug 8, 2021 2:50 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఎనలేని హైప్ ను సంతరించుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఈ నెలలోనే అదిరే అప్డేట్స్ ను కూడా ఇచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్న టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ బర్త్ డే కానుకగా ఈరోజు మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ సాలిడ్ పోస్టర్ ని వదిలారు.

ఫహద్ ముఖాన్ని పూర్తిగా చూపకుండా ఒక్క కన్నుని హైలైట్ చేస్తూ తనలోని ఈవిల్ నెస్ ని ఇంటెన్స్ గా చూపిస్తూ అదిరే క్యాప్షన్ ని కూడా పెట్టారు.. దీనితో ఫహద్ రోల్ ఈ చిత్రంలో ఎంత సాలిడ్ గా ఉండనుండో అర్ధం అవుతుంది. మరి ఫహద్ ఎంట్రీ ఫస్ట్ పార్ట్ లో ఉంటుందా రెండో పార్ట్ లో ఉంటుందా అన్నది చూడాలి. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :