వైరల్ : “పుష్ప 2” కి ఈ హంట్ స్టార్ట్ చేసిన మేకర్స్.!

Published on Jun 7, 2022 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ “పుష్ప ది రైజ్”. మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా హిట్ తో పుష్ప 2 పై అయితే తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తుండగా లొకేషన్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు తాజాగా మరో హంట్ లోకి దిగడం వైరల్ గా మారింది. మరి ఇప్పుడు అయితే మేకర్స్ తమ సినిమాలోకి నటీ నటుల వేటలో పడ్డారట.

తమ ఆఫీస్ ఆడిషన్స్ కోసం పోస్టర్ పెట్టడం ఇప్పుడు ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ ఆడిషన్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరగనున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :