ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” దద్దరిల్లడం ఖాయం!

Published on Jul 11, 2021 11:21 pm IST

స్టైలిష్ స్టార్ గా కాదు ఐకాన్ స్టార్ గా ఎదుగుతున్నారు అల్లు అర్జున్. ఇప్పటి వరకు తన నటన తో, డాన్స్ తో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. అయితే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయితే మొదటి సారిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్పరాజ్ గా పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నారు అల్లు అర్జున్.

అయితే ఈ చిత్రం ను ఇప్పటికీ లెక్కల మాస్టర్ సుకుమార్ తీర్చి దిద్దుతున్నారు. అయితే సౌత్ నాట గట్టి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ నార్త్ లో కూడా ఇప్పుడిప్పుడే తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా పుష్ప చిత్రం హిందీ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్ దీనికి కీలక వ్యక్తి గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తను తీసుకున్న పుష్ప తో నార్త్ లో కూడా కనక వర్షం కురవడం ఖాయం అంటూ సినీ విమర్శకులు అంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ చిత్రం లో విలన్ పాత్ర ను పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :