నేడు అల్లు అర్జున్ సమంత ల స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం!

Published on Nov 29, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట చిత్ర యూనిట్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారు. రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సమంత ను భారీ మొత్తం ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత మరియు అల్లు అర్జున్ లు ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. నేడు ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. సమంత మొదటిసారి గా స్పెషల్ సాంగ్ లో చేస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మలయాళ నటుడు ఫాహద్, ధనంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :