“పుష్ప” మూవీ అచ్చం అలానే ఉండబోతుందట?

Published on Aug 7, 2021 2:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ సినిమా క‌థ‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం రివేంజ్ డ్రామా అని అందరూ అనుకుంటున్న నేపధ్యంలో ఇప్పుడు మరో వార్త బయటకొచ్చింది. కేజీఎఫ్ త‌రహాలోనే పుష్ప సినిమా కూడా ఉండబోతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడని, స్మగ్లింగ్ చేస్తూ పెద్ద డాన్‌గా ఎలా ఎదిగాడనేది ఫస్ట్ పార్ట్‌లో చూపిస్తారని, ఇక సెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్ డాన్ అయిన తర్వాత వచ్చే సన్నివేశాలు చూపించినున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ రోల్‌ చేస్తుండగా, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :