“పుష్ప” రాజ్ ఎంట్రీ అక్కడ సాలిడ్ గానే ఉండేలా ఉంది.!

Published on Jul 10, 2021 4:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన ఆల్ టైం మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న లేటెస్ట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియన్ ” పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు తుది దశ షూట్ లో ఉంది. అయితే ఈ సినిమాతోనే బన్నీ సిసలైన స్టామినా ఏంటో అందరికీ తెలియనుంది అని చెప్పాలి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ లో కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ బన్నీకి ఉంది.

అలాగే ఇక హిందీ ఆడియెన్స్ లో అయితే చెప్పనక్కర్లేదు.. అందుకే ఈ స్ట్రాంగ్ సబ్జెక్ట్ తోనే ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని బన్నీ ఫిక్స్ అయ్యాడు. అలాగే అంతిమంగా బన్నీ టార్గెట్ కూడా ఈ సినిమాతో బాలీవుడ్ అనే చెప్పాలి. అయితే మరి పుష్ప కి థియేట్రికల్ గా సాలిడ్ ఎంట్రీ దొరుకుతుందా అంటే దానికి అవుననే సమాధానమే మళ్ళీ దొరుకుతుంది.

పుష్ప కి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల నుంచి సాలిడ్ డీల్స్ వస్తున్నాయట. అలాగే ఈ సినిమాని పుష్ప మేకర్స్ అక్కడ నుంచి నోటెడ్ ప్రెజెంటర్ తో తీసుకెళ్లాలని ప్లానింగ్స్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనితో బన్నీ ఎంట్రీ బాలీవుడ్ లో ఒకింత గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :