బాక్సాఫీస్ దగ్గర “పుష్ప” రాజ్ స్ట్రామ్..తగ్గేదేలే..!

Published on Dec 24, 2021 10:06 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” గత వారం రిలీజ్ అయ్యి ఐకాన్ స్టార్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. మరి ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఆల్ టైం రికార్డు గ్రాసింగ్ వసూళ్లతో లెక్కను స్టార్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఫాస్టెస్ట్ 200 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం నిలిచింది.

మరి ఇప్పుడు ఈ చిత్రం మొదటి వారానికి గాను 229 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనితో పుష్ప రాజ్ స్ట్రామ్ బాక్సాఫీస్ దగ్గర ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ చిత్రం యూ ఎస్ లో 2 మిలియన్ క్రాస్ కూడా చేసి ఆ క్లబ్ లో చేరింది. మరి ఫైనల్ గా పుష్ప రాజ్ లెక్క ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :