హిందీలో మాస్ చూపిస్తున్న “పుష్ప”..డే 4 సాలిడ్ వసూళ్లు!

Published on Dec 21, 2021 1:00 pm IST

తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి “పుష్ప” తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ హిట్ ని అందుకున్నాడు. తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేసిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా బన్నీ కి ఇది అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. ఈ సినిమాలో బన్నీ బాలీవుడ్ మార్కెట్ లో అసలు స్టామినా ఏంటి అనేది ప్రూవ్ చెయ్యాల్సి ఉంది.

ఇప్పుడు అది స్యూర్ షాట్ గా ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. హిందీ వెర్షన్ కి వస్తే సినిమాకి సరైన ప్రమోషన్స్ కూడా జరగలేదు. అయినా కూడా పుష్ప రాజ్ బ్యాటింగ్ మాత్రం అక్కడ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. మొదటి రోజు రీసెంట్ వసూళ్లు అందుకున్నా ఆ తర్వాత రెండు రోజులు కూడా పుష్ప పుంజుకున్నాడు.

ఇక అసలైన నాలుగో రోజు అందులోని సోమవారం కూడా మాస్ చూపించినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి గాను అక్కడ నాలుగో రోజు 4.25 కోట్లు నెట్ వసూలు అయ్యాయట. ఇది కూడా మొదటి రెండు రోజులు కన్నా అధికం దీని బట్టి పుష్ప హిందీలో ఎంత స్థాయిలో క్లిక్ అయ్యిందో చెప్పొచ్చు. అలాగే రెండో పార్ట్ కి కూడా ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆరంభం అని కూడా చెప్పాలి.

సంబంధిత సమాచారం :