“పుష్ప” టీజర్ అప్పుడే కాదా..?

Published on Mar 2, 2021 7:01 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన ఆల్ టైం హిట్ కాంబో సుకుమార్ మరియు దేవిశ్రీప్రసాద్ తో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం “పుష్ప”. వీరి కాంబో అని కాకుండా పాన్ ఇండియన్ లెవెల్లో ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల ఒక స్ట్రాంగ్ బజ్ బయటకు వచ్చింది. అదే ఈ సినిమా టీజర్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏప్రిల్ లో విడుదల చేస్తున్నారని..

అయితే ఇందుకు పాజిబిలిటీ ఉందా లేదా అన్నది చూసుకున్నట్టు అయితే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా పెట్టుకున్న టార్గెట్ కి అప్పుడే టీజర్ అంటే కాస్త ముందే అని చెప్పాలి. మరి ఆ సమయానికి ట్రీట్ ఏం లేదా అంటే ఉండొచ్చు కానీ ఎక్కువగా అయితే లేటెస్ట్ ట్రెండ్ గ్లిమ్ప్స్ టీజర్ మాత్రమే వస్తుంది అని చెప్పాలి.. సో టీజర్ అయితే వచ్చే అవకాశం లేనట్టే అని చెప్పాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో తెలియాలి అంటే అప్పటి వారికీ వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :