టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ మూవీలో పుష్ప రాజ్ గా అద్భుత నటన ప్రదర్శించినందుకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్ పై దేశవ్యాప్తంగా ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2024 మార్చి 22న పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా వారు ఈ డేట్ ని పరిశీలిస్తున్నారని, త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్. కాగా పుష్ప ది రూల్ మూవీని మొదటి పార్ట్ ని మించి మరింత అద్భుతంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రిలీజ్ అనంతరం మూవీ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావము వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
