‘పుష్ప’ కోసం మరో హీరో కావాలి !

‘పుష్ప’ కోసం మరో హీరో కావాలి !

Published on Nov 23, 2020 11:30 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి లాంటి మరో హీరో కోసం పుష్ప టీమ్ వెతుకులాట మొదలెట్టింది. మరి విజయ్ సేతుపతి లాంటి హీరో.. పైగా తమిళం లాంటి భాషలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో దొరకడం అంటే కష్టమే. మరి చూడాలి ఎవర్ని తీసుకుంటారో.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి బన్నీ పుష్ప కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు