పంజా వైష్ణవ్ తేజ్ 4 : ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 13, 2023 9:15 pm IST


పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఎన్ డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వైష్ణవ్ తేజ్ కెరీర్ 4వ మూవీగా ఇది తెరకెక్కుతోంది సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ నుండి హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల ఫస్ట్ లుక్ ని ఇప్పటికే రిలీజ్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా మూవీ ఫస్ట్ గ్లింప్స్ పై అప్ డేట్ ని అందించారు.

కాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని మే 15న సాయంత్రం 4 గం. 05 ని. లకు విడుదల చేస్తున్నట్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ ఊహకు అందని విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. మలయాళం నుండి జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు జోజు జార్జ్ ఈ మూవీతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. దాదా అండ్ బీస్ట్ మూవీస్ ఫేమ్ అపర్ణా దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :