జయలలిత బయోపిక్ పై అంచనాలు పెంచేస్తున్న రమ్యకృష్ణ

Published on Dec 10, 2019 10:16 pm IST

క్వీన్ పేరుతో టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ జయలలిత జీవిత గాథను వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాల్యం నుండి మరణం వరకు జయలలిత జీవితం విజయాలు.. వివాదాలు.. మలుపులతో సాగింది. ఒక సినిమాకు మించిన నాటకీయత ఆమె జీవితంలో చోటు చేసుకుంది. ఆమె జీవితంలో అన్ని ముఖ్య ఘట్టాలను తెరకెక్కించడం రెండున్నర గంటల సినిమాతో సాధ్యం కాదని గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నారు. ఐతే జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకోవడం ఈ సిరీస్ పై మరింత ఆసక్తిని రేపుతోంది. నటిగా పవర్ ఫుల్ పాత్రలకు రమ్య కృష్ణ పెట్టింది పేరు.

నరసింహ సినిమాలలో రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ ని కూడా డామినేట్ చేసేలా రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర ఉంటుంది. బాహుబలి చిత్రంలో శివగామిగా ఆమె పాత్ర మూవీలో ప్రముఖంగా నిలిచింది. ఇలాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు రమ్య కృష్ణ కెరీర్ లో ఎన్నో చేశారు. ఇక జయలలితగా ఆమె అద్భుతంగా కనిపిస్తున్నారు. జయలలితగా రమ్య కృష్ణ లుక్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. డిసెంబర్ 14నుండి క్వీన్ ఎపిసోడ్స్ ఎంఎక్స్ ఒరిజినల్ సిరీస్ నందు ప్రసారం కానున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More