ఎన్టీఆర్ హావభావాల్ని ఇమిటేట్‌ చేసేవారట !

Published on Jul 12, 2021 9:10 pm IST

పీపుల్ స్టార్ ‘ఆర్‌. నారాయణమూర్తి’ ‘నేరము- శిక్ష’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి ‘నీడ’ సినిమాతో హీరోగా ఎదిగారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జనం సమస్యలనే కథలు గా ఎన్నుకుంటూ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న నారాయణ మూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కాగా ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

నారాయణ మూర్తి పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని రౌతులపూడిలోనే. ఆయన తన చిన్న తనంలో ఎక్కువుగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ సినిమాలు చూసేవారు. ఆ సినిమాలు చూసి అలా ఎన్టీఆర్ హావభావాల్ని స్నేహితులతో కలిసి ఇమిటేట్‌ చేసేవారట. ఆ ఆసక్తితోనే ఆయన బి.ఎ. పాసయ్యాక సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.
ఇక తన సినిమాలు తన కెరీర్ మొదట్లో బ్రహ్మాండంగా ఆడాయి.

కానీ అందరూ తన పంథాలోనే సినిమాలు తీయడం మొదలుపెట్టడంతో నారాయణ మూర్తి సినిమాల పై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింది. అయినా ఆయన ఇంకా తనదైన సినిమాలనే తీస్తూ ఉండటం విశేషం.

సంబంధిత సమాచారం :