సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య’ రిలీజ్ డేట్

Ra Ra Krishnayya
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘రారా కృష్ణయ్య’. ఈ చిత్ర టీం ఈ సినిమాని జూన్ 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఆడియోని కూడా రిలీజ్ చేసారు.

సందీప్ కిషన్ సరసన రెండవసారి రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి అన్నాగా పూర్తి మాస్ లుక్ లో జగపతి బాబు కనిపించనున్నాడు. జగపతి బాబుకి జోడీగా కళ్యాణి కనిపించనుంది. కామెడీ-లవ్ సమానంగా ఉంటుందని చెప్తున్న ‘రారా కృష్ణయ్య’ ద్వారా మహేష్ బాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమాని కృష్ణ శ్రీనివాస్ నిర్మించారు.

Exit mobile version