రాశీ ఖన్నాకు రెస్ట్ దొరికేట్టు లేదుగా

Published on Dec 9, 2019 12:52 pm IST

సాధారణంగా చేసిన ఒక సినిమా విడుదలవుతుంది అంటేనే ప్రమోషన్స్ పేరుతో హీరోయిన్లకు బోలెడంత పను ఉంటుంది. అలాంటిది వారం వ్యవధిలో రెండు సినిమాలంటే.. ఇక ఆ కంగారు, వర్క్ ప్రెజర్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా పరిస్థితి ఇలానే ఉంది. ఆమె చేసిన ‘వెంకీ మామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలు వారం వ్యవధిలో విడుదలకానున్నాయి.

ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో రూపొందిన ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న విడుదలకానుంది. దీంతో ఈ సినిమా ప్రచార పనులు మొదలైపోయాయి. రాశీ ఖన్నా ఈ నాలుగైదు రోజులు ఆ పనుల్లోనే ఉండనుంది. ఇక ఆ పనులు ముగియగానే డిసెంబర్ 20న విడుదల కావల్సిన ‘ప్రతిరోజూ పండగే’ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వీటిలో ఏ చిత్రాన్నీ రాశీ నిర్లక్ష్యం చేయలేదు. రెండూ ఆమెకు ముఖ్యమైనవే. అందుకే ఈ పది రోజులూ రాశీకి ప్రమోషన్ల పుణ్యమా అని రెస్ట్ అనేదే దొరకదన్నమాట.

సంబంధిత సమాచారం :

More