తెలుగులో వెబ్ సిరీస్ కి సిద్దమవుతున్న రాశిఖన్నా!?

Published on Jul 15, 2021 3:20 pm IST


ప్రస్తుతం ఓటిటి ల హవా నడుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దేశం లో అడుగు పెట్టినప్పటి నుండి ప్రేక్షకులు ఆన్లైన్ లో సినిమాలు, సిరీస్ లు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు లో సైతం ఈ ఓటిటి హవా నడుస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే హిందీ లో ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ తో రాశి ఖన్నా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సీరీస్ కి రాజ్ మరియు డీకే లు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది.

అయితే ప్రముఖ ఓటిటి సంస్థ అయిన సోని లైవ్ నటి రాశి ఖన్నా తో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాశి ఖన్నా తో తెలుగు లో ఒక వెబ్ సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోని లైవ్ ప్రస్తుతం పలు షో లను తెలుగు లో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాశి ఖన్నా తో ఈ వెబ్ సిరీస్ తో తెలుగు లో కూడా సోని లైవ్ తమ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాశి ఖన్నా తో చేయబోయే వెబ్ సిరీస్ కు సూర్య వంగల దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మిస్టరీ డ్రామా అని, రాశి ఖన్నా అందులో డిటెక్టివ్ గా నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :