తప్పులేకపోయినా సారీ చెప్పిన రాశీఖన్నా !

Published on May 17, 2019 11:54 am IST

టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా తమిళంలో చేసిన తాజా చిత్రం ‘ఆయోగ్య’. తెలుగు ‘టెంపర్’ చిత్రానికి ఇది రీమేక్. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక అడ్డంకుల్ని ఎదుర్కొని 11వ తేదీన విడుదలై బాగానే ఆడుతోంది. ఇక విషయానికొస్తే సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్ లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు.

దీంతో రాశీఖన్నాకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా ఎస్.ఆర్ నొచ్చుకుని డ్రైవర్లకు, పెయింటర్లకు, మెస్ వారికి, సౌండ్ ఇంజనీర్లకు అందరికీ ఎండ్ టైటిల్స్ వేసేప్పుడు క్రెడిట్స్ ఇచ్చారు. కానీ మా వాయిస్ ఆర్టిస్టులను మాత్రం వదిలేయడం బాధ కలిగిస్తోంది అంటూ ట్వీట్ చేశారు. అది చూసి స్పందించిన రాశీఖన్నా వ్యవహారంలో తన ప్రేమేయం ఏమీ లేకపోయినా జరిగిన దానికి సారీ చెబుతూ స్క్రీన్ మీద నన్ను మరింత ఎలివేట్ చేయడానికి అందమైన గొంతును ఇచ్చిన మీకు చాలా కృతజ్ఞతలు అన్నారు.

సంబంధిత సమాచారం :

More