ఫోటో మూమెంట్ : షాహిద్ ఫీలింగ్ పై రాశీ ఖన్నా ఫన్!

Published on Aug 12, 2021 3:20 pm IST


ఇండియన్ ఓటిటి కంటెంట్ దగ్గర ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి ఎలాంటి స్థానం ఉందో మన అందరికీ తెలుసు. మరి అలాంటి సిరీస్ ని అందించిన క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే లు దాని తర్వాత “సన్నీ” అనే మరో సాలిడ్ సిరీస్ ని స్టార్ట్ చేశారు. మరి దానిలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ మరియు స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఈరోజుతో ఈ సిరీస్ షూట్ అంతా కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది.

మరి ఈ ఇద్దరు హీరోహీరోయిన్స్ కి ఓటిటిలో ఇదే డెబ్యూ కాగా రాశిఖన్నా షేర్ చేసిన లెట్స్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో రాశీ ఖన్నా ని డైరెక్టర్ హగ్ చేసుకొని ఉండగా షాహిద్ మాత్రం పక్కనే నిలబడి అలా చూస్తున్నాడు. దీనితో రాశీ ఈ పిక్ ని షేర్ చేసి “ఏం పర్లేదు లే షాహిద్ వాళ్లకి నువ్ కూడా ఇష్టమే” అని సర్కాస్టిక్ గా పోస్ట్ చేసింది. దీనితో ఇది కాస్తా వైరల్ గా మారింది. అలాగే మరో పక్క ఫ్యాన్స్ కూడా ఈ సిరీస్ రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :