
పూర్తి మాస్ హీరో అన్న బ్రాండ్ నుంచి బయటకొచ్చి సాహసం, లౌక్యం, జిల్ లాంటి సినిమాలతో తాను ఇతర తరహా పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించారు హీరో గోపీచంద్. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతోన్న ఈ స్టార్, త్వరలోనే ప్రఖ్యాత నిర్మాత ఏ.ఎమ్.రత్నం కుమారుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. జిల్ సినిమాలో గోపీచంద్, రాశిఖన్నాల కెమిస్ట్రీకి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాశిఖన్నాను సంప్రదించగా ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక గోపీచంద్ ప్రస్తుతం తన సౌఖ్యం సినిమాను క్రిస్‌మస్ కానుకగా విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

