ఈ వారాంతం నుండి ఎన్.టి.ఆర్ ‘రభస’ కొత్త షెడ్యూల్

Published on Apr 3, 2014 8:36 am IST

ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రభస'(వర్కింగ్ టైటిల్). డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కి ఆరోగ్యం సరిగా లేనందు వల్ల గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. సంతోష్ శ్రీనివాస్ కాస్త కోలుకోవడంతో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని ఏప్రిల్ 5 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్ లో భాగంగా ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ నటిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో కామెడీ బాగా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :