రామానాయుడులో ఎన్.టి.ఆర్ – సమంతల ఆటా పాటా

Published on Feb 26, 2014 2:15 pm IST

ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘రభస’ మూవీ షూటింగ్ ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – సమంతలపై ఓ పాటని షూట్ చేస్తున్నారు. రాజు సుందరం కోరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట షూటింగ్ అక్కడే మరి కొద్ది రోజులు జరగనుంది. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

కందిరీగ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. సమంతతో పాటు ప్రణిత కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీలో ఎన్.టి.ఆర్ కి సమంత – ప్రణితలతో ట్రై యాంగిల్ లవ్ ట్రాక్ ఉండనుంది. అలాగే సెకండాఫ్ మొత్తం కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుందని సమాచారం.

‘రభస’ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే రిలీజ్ సమయానికి టైటిల్ మారే అవకాశం ఉంది. ఈ మూవీ 2014 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :