ఎర్త్ డే సందర్భంగా మొయినాబాద్‌లో రాధే గ్రూప్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎర్త్ డే సందర్భంగా మొయినాబాద్‌లో రాధే గ్రూప్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

Published on Apr 22, 2026 9:00 PM IST

ఎర్త్ డే (ఏప్రిల్ 22) సందర్భంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాధే గ్రూప్, సంకల్పతరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ వృక్షారోపణ కార్యక్రమం జరిగింది. మొయినాబాద్‌లోని శ్రీరామ్ నగర్ కమ్యూనిటీ సైట్‌లో రాధే గ్రూప్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని స్థానిక వాతావరణానికి అనువైన 150 మొక్కలను నాటారు.

​ఈ కార్యక్రమానికి రాధే గ్రూప్ చైర్మన్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని, ప్రకృతికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని సంస్థ ఎండీ రాధే దగ్గుమల్ల తెలిపారు.

​“కలిసి పచ్చని, సురక్షితమైన రేపటిని నిర్మిద్దాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో శ్రీమతి దగ్గుమల్ల సుజాత, ఎండీ సతీమణి ఎస్తర్ ప్రియాంక, డైరెక్టర్ రాజీవి దగ్గుమల్లతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన నిర్మాణాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తమ వంతు కృషి చేస్తున్నట్లు రాధే గ్రూప్ ఈ సందర్భంగా చాటిచెప్పింది.

తాజా వార్తలు