“రాధేశ్యామ్” మొట్టమొదటి ప్రీమియర్ షో ఈ థియేటర్‌లోనే..!

Published on Mar 10, 2022 3:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.

ఇక ఈ సినిమా రిలీజ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో “రాధేశ్యామ్” మొట్టమొదటి ప్రీమియర్ షో ఎక్కడో తేలిపోయింది. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో బెనిఫిట్ షో ఉండబోతుందని, ఇక్కడి నుంచే “రాధేశ్యామ్”ని మీ ముందుకు తీసుకొస్తామని శ్రేయాస్ మీడియా సంస్థ తెలిపింది.

సంబంధిత సమాచారం :