“రాధే శ్యామ్” నుంచి బిగ్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్.!

Published on Feb 27, 2022 4:45 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొల్పుకొని విడుదలకి సిద్ధం అవుతుంది. మరి ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ సాలిడ్ ప్లాన్స్ తో బిగ్ అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు కితమే ఈ సినిమా హిందీ వెర్షన్ కి గాను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తన వాయిస్ ఓవర్ ని అందిస్తున్నారని కన్ఫర్మ్ చెయ్యగా..

ఇప్పుడు మేకర్స్ మిగతా భాషలకి సంబంధించి బిగ్ అప్డేట్స్ రివీల్ చేసారు. మరి వీటి ప్రకారం అయితే రాధే శ్యామ్ తెలు వెర్షన్ కి గాను దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అందిస్తుండగా కన్నడ వెర్షన్ కి అక్కడి స్టార్ హీరో శివ రాజ్ కుమార్ మరియు మళయాళ వెర్షన్ కి గాను అక్కడి టాలెంటెడ్ హీరో పృథ్వీ రాజ్ అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి తమిళ్ వెర్షన్ కి ఎవరు చెబుతారో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :