“రాధే శ్యామ్” షూటింగ్ ముగిసేది అప్పుడేనా!?

Published on Jul 16, 2021 3:44 pm IST


పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే సాహో చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఈ చిత్రం షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వనున్నారు. ఈ నెల 23 వ తేదీ నుండి ఆగస్ట్ 5 వ తేదీ వరకు జరగనున్న షూటింగ్ లో పాల్గొననున్నారు.

అయితే ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ తో ముగిసే అవకాశం ఉంది. ఈ చిత్రం లో ప్రభాస్ కి జోడీ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :