సౌత్ ఇండియా ను షేక్ చేసిన రాధే శ్యామ్…బాహుబలి 2 రికార్డ్ బద్దలు!

Published on Dec 25, 2021 12:02 am IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. సౌత్ ఇండియా ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. 24 గంటల్లో ఈ చిత్రం ట్రైలర్ 23.2 మిలియన్ వ్యూస్ ను సాధించడం జరిగింది. ఇప్పటి వరకూ బాహుబలి 2 చిత్రం 21.8 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉండగా, ఇప్పుడు రాధే శ్యామ్ టాప్ లోకి దూసుకు పోవడం విశేషం.

హిందీ లో సైతం ఈ ట్రైలర్ కి 28.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడం తో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :